Jan 18, 2021, 11:10 AM IST
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో చతుర్వేద హవనం ఘనంగా ప్రారంభమయ్యింది. లోకకళ్యాణం కోసం, దేశ సంరక్షణార్థం చతుర్వేద హవనం ప్రారంభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. చిన్న రాజ గోపురం వద్ద యాగశాలని నిర్మించి అందులో చతుర్వేద హోమాలు ప్రారంభించారు. హంపి విరూపాక్ష స్వామి వారి ఆధ్వర్యంలో చతుర్వేద హవనం, హోమాలు ప్రారంభమయ్యాయి. ఈ చతుర్వేద హోమంలో దుర్గగుడి ఈవో సురేష్ బాబు, చైర్మన్ పైల సోమినాయుడు దంపతులు పాల్గొన్నారు. ఎనిమిది రోజుల పాటు చతుర్వేద హావనం,హోమాలు కొనసాగనున్నాయి.