సింహాద్రి అప్పన్న చందనోత్సవం... స్వామివారి నిజరూప దర్శనంకోసం పోటెత్తిన భక్తులు

May 3, 2022, 11:53 AM IST

విశాఖపట్నం: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసారు. అప్పన్న స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు వీఐపిల సింహాచలం బాటపట్టారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు వేణుగోపాల్, అమర్నాథ్ ఈ చందనోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర కూడా చందనోత్సవంలో పాల్గొని అప్పన్నను దర్శించుకున్నారు.