Video news : అమావాస్య అర్థరాత్రి ఆలయంలో పూజలు..

Nov 27, 2019, 1:24 PM IST

తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న నీలకంటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు జరిగాయి. మంగళవారం అమావాస్య కావడంతో ఆలయ అధికారుల అనుమతి లేకుండా చెన్నైకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఆలయంలో అనధికారికంగా పూజలు నిర్వహిస్తుంచారు. దీన్ని గమనించినస్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పూజలు నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పూజలు నిర్వహించేందుకు శ్రీకాళహస్తి ఆలయ ఏఈఓ ధనపాల్ సహకరించాడని ఆరోపణలు రావడంతో ఏఈఓ ధనపాల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.