ఏపీలో ముందస్తు ఎన్నికలు... ఫ్లోలో చెప్పేసిన సజ్జల

May 7, 2022, 2:24 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల వస్తాయనే చర్చ గత కొంతకాలంగా కొనసాగుతుంది. అయితే వైసీపీ శ్రేణులు ఈ వార్తలను ఖండిస్తూ వచ్చాయి. అయితే తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే.. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమేనని అనిపిస్తుంది. తాజాగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ఫ్లోలో నోరుజారారు. ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని సజ్జల చెప్పారు. తమ ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి బాగా వెళ్లిందని, జగన్ అమలు చేసిన పథకాలు విజయవంతమయ్యాయని అన్నారు. మాములుగా అయితే ఏపీలో మరో రెండేళ్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే సజ్జల మాత్రం ఏడాది, రెండేళ్లలో అని చెప్పడం ద్వారా.. వైసీపీ క్యాడర్‌లోని ముందస్తు సంకేతాలు పంపారనే టాక్ వినిపిస్తోంది.