Jul 15, 2020, 2:44 PM IST
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఉత్తరాపల్లి జంక్షన్ లో ప్రమాదం జరిగింది. కొత్తవలస నుంచి ఎస్ కోట వైపు వెళ్తున్న లారీని ఎల్ కోట నుంచి కొత్తవలస వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వచ్చి క్షతగాత్రులని విశాఖపట్నంలోని KGHకి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.