Mar 22, 2022, 12:30 PM IST
అమరావతి: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో ముష్టిపల్లి సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో వాహనంలోకి ఎర్రచందనం దుండలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎర్రచందనం స్మగ్లర్లు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలంనుండి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రత్యేక టీంలు ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.