Allu Arjun, Pushpa 2 , Box-office Collections
"పుష్ప 2: ది రూల్" బాక్సాఫీస్ దగ్గర తన జోరుని కొనసాగిస్తోంది. వీకెండ్ తర్వాత కూడా చాలా చోట్ల రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది. అసలు తొలి రోజునుంచే ఈ కలెక్షన్ల ప్రభంజన కొనసాగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
ఇది ఇంతకు ముందు రికార్డు హోల్డర్ "ఆర్ఆర్ఆర్" మరియు "బాహుబలి" సినిమాలను దాటింది. ఇండియాలో రూ. 165 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి, వీటిలో తెలుగు మార్కెట్ నుంచే రూ. 85 కోట్లు సాధించింది. ఈ క్రమంలో వారం పూర్తయ్యే సరికి పుష్ప 2 తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని చూద్దాం.
pushpa 2
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన "పుష్ప 2: ది రూల్" సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తొలి భాగం "పుష్ప: ది రైజ్" విజయం తరువాత ఈ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, వాటిని అందుకుని సినిమా అన్ని భాషల్లో అత్యధిక వసూళ్లను సాధిస్తోంది.
అల్లు అర్జున్ పుష్ప 2 తెలుగు వెర్షన్ 7 రోజుల ప్రపంచవ్యాప్తంగా బాక్స్-ఆఫీస్ కలెక్షన్స్
ప్రాంతం షేర్
నైజాం ₹ 70.5 కోట్లు
సీడెడ్ ₹ 25.2 కోట్లు
ఉత్తరాంధ్ర ₹ 17.3 కోట్లు
గుంటూరు ₹ 12.2 కోట్లు
తూర్పు గోదావరి ₹ 9.2 కోట్లు
పశ్చిమ గోదావరి ₹ 7.85 కోట్లు
కృష్ణ ₹ 10 కోట్లు
నెల్లూరు ₹ 5.9 కోట్లు
AP/TS ₹ 158.15 కోట్లు
ROI (సుమారు) ₹ 27 కోట్లు
ఓవర్సీస్ ₹ 49 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ₹ 234.5 కోట్లు
డిసెంబరు 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్ని వెర్షన్లలోనూ దూసుకెళుతోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాలలో భారీ వసూళ్లు రాబడుతోంది. ఒరిజినల్ తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్‌లోనే అధిక కలెక్షన్లు వస్తున్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో పుష్ప-2 రికార్డు మైలురాయిని అందుకోబోతోంది. రూ.1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టబోతోందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే విడుదలైన వారం రోజుల్లోనే ఈ మైలురాయిని సాధించిన భారతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించడం ఖాయం.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన థాంక్యూ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ఎప్పుడూ చెబుతుంటాను... రికార్డులు ఉన్నది బద్దలు కొట్టడానికేనని! మరో రెండు, మూడు నెలలు పాటు నేను ఈ రికార్డులన్నింటినీ చక్కగా ఆస్వాదిస్తానేమో.
కానీ, వచ్చే వేసవిలో విడుదలయ్యే సినిమాల్లో ఏదో ఒకటి నా సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని కోరుకుంటాను. ఈ వసూళ్ల అంకెలు తాత్కాలికం మాత్రమే... కానీ అభిమానులు, ప్రేక్షకులు చూపించే ప్రేమ మాత్రం నా హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది" అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.