సాయిధరమ్ తేజ్ ఒక మంచి కొడుకుగా, మంచి అన్నగా, మంచి స్నేహితుడిగా, మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజు 10 ఏళ్ళ పాటు బ్యూటిఫుల్ జర్నీని పూర్తి చేసుకున్నాడు. తేజుకి జరిగిన ప్రమాదాన్ని నేను గుర్తు చేసుకోవాలి అను అనుకోవడంలేదు. కానీ ఒక మాట చెప్పాలని అనిపిస్తోంది. ఆంజనేయస్వామి మీద ఒట్టేసి చెబుతున్నా.. అభిమానుల ఆశీర్వాదం వల్లే తేజుకి పునర్జన్మ లభించింది. తేజు కోసం మేమంతా మూడు నెలలపాటు గుండెలు బిగపట్టుకుని ఎదురుచూశాం. అంతలా భయపడ్డాం అని రాంచరణ్ ఎమోషనల్ అయ్యారు.