మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి దాగి ఉందని మాజీ మంత్రి విడదల రజని తీవ్ర ఆరోపణలు చేశారు. పీపీపీ పేరుతో విలువైన భూములు, కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, జీతాల కోసం ప్రభుత్వమే వందల కోట్ల రూపాయలు చెల్లిస్తోందని విమర్శించారు.