విశాఖలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

Jul 7, 2020, 11:00 AM IST

విశాఖ గాజువాకలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. నలుగురు అమ్మాయిలతో పాటు ముగ్గురు విటులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గాజువాక కర్ణవాని పాలెంలో  వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి వీరిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.