అంతే కాదు కజిన్ సిస్టర్స్ అందరికి పెళ్లి అయిపోవడం , సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాకపోవడం వల్ల కరోనా మంచి సమయమని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారట. దాంతో తాను ఇంకా నా కెరియర్ లో అనుకున్నది ఏ మాత్రం సాధించలేదని. ఇప్పుడే ఎలా పెళ్లి చేసుకోవాలని వాదించిందట సాయి పల్లవి.
ఇక కరోనా టైమ్ అయిపోయే వరకూ తనకు ఈ టార్చర్ తప్పలేదంటోంది బ్యూటీ. ఇక కరోనా అయిపోయిన తర్వాత సినిమాల బిజీ వల్ల తన పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదట.
అలా తన కెరియర్ లో అనుకున్నది సాధించేవరకు పెళ్లి చేసుకోనని, ఒకవేళ చేసుకుంటే తల్లితండ్రులు చూసిన అబ్బాయిని చేసుకుంటానని సాయి పల్లవి చెప్పేసింది. తాజాగా కీర్తి సురేష్ పెళ్ళి జరగడంతో.. మళ్ళీ సాయిపల్లవిపై పెళ్లి ప్రెజర్ పెరిగే అవకాశం లేకపోలేదు అనుకుంటున్నారు ఫ్యాన్స్.