షూటింగ్‌ ప్రారంభమై ఆగిపోయిన సౌందర్య, వెంకటేష్‌ల సినిమా ఏంటో తెలుసా? కారణం ఎవరు? అసలేం జరిగిందంటే

Published : Dec 13, 2024, 07:24 PM IST

వెంకటేష్‌, సౌందర్య కాంబినేషన్‌లో ఓ సినిమా షూటింగ్‌ ప్రారంభమై, మధ్యలోనే ఆగిపోయింది. మరి ఆ మూవీ ఏంటి? ఎందుకు ఆగిపోయిందనేది చూస్తే   

PREV
15
షూటింగ్‌ ప్రారంభమై ఆగిపోయిన సౌందర్య, వెంకటేష్‌ల సినిమా ఏంటో తెలుసా? కారణం ఎవరు? అసలేం జరిగిందంటే

విక్టరీ వెంకటేష్‌, సౌందర్య టాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. ఈ ఇద్దరు జంటగా ఏకంగా ఆరు సినిమాలు వచ్చాయి. ఆరూ మంచి విజయాలు సాధించాయి. ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌ గానూ నిలిచింది. ఈ ఇద్దరు కలిసి `పవిత్ర బంధం`, `పెళ్లిచేసుకుందాం`, `దేవి పుత్రుడు`, `రాజా`, `జయం మనదేరా`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు` వంటి సినిమాలు చేశారు. అయితే వీరి కాంబోలో మరో సినిమా కూడా రావాల్సింది. కానీ క్యాన్సిల్‌ అయ్యింది. మరి ఆ మూవీ ఏంటి? ఆగిపోవడానికి కారణమేంటి? అనేది చూస్తే. 
 

25

సురేష్‌ ప్రొడక్షన్‌లో వెంకటేష్‌, సౌందర్యది సూపర్‌ హిట్‌ పెయిర్‌ అనే విషయం తెలిసిందే. ఆ కాంబోని మరోసారి రిపీట్‌ చేస్తూ సినిమా చేయాలని భావించారు నిర్మాత సురేష్‌ బాబు. అయితే ఈసారి సౌందర్యతోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా అనుకున్నారు. వాణి విశ్వనాథ్‌, మాలా శ్రీ హీరోయిన్లుగా అనుకున్నారు. జయంత్‌ సి పరాంజీ దర్శకుడు. ఆయనకు ఇదే తొలి సినిమా. కాకపోతే సురేష్‌ ప్రొడక్షన్‌ మూడు సినిమాలకు ఆయన పనిచేశారు. ఆ అనుభవంతోనే డైరెక్షన్‌ ఛాన్స్ ఇచ్చారు సురేష్‌ బాబు. 
 

35

ఓ సినిమా కథ అనుకుని సినిమా ప్రారంభించారు. ఫ్యామిలీ డ్రామా, కామెడీలో క్రైమ్‌ ఎలిమెంట్లు మేళవించిన కథ ఇది. దీనికి ఏ ఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ కూడా చేశారు. పది రోజులపాటు అన్నపూర్ణ స్టూడియోలో  మొదటి షెడ్యూల్‌ అయిపోయాక రష్‌ చూసుకున్నాక మేకర్స్ కి మతిపోయింది. ఇది వర్కౌట్‌ కాని సబ్జెక్ట్ అని అర్థమైంది. దర్శకుడు జయంత్‌నే ఇది సెట్‌ కాదు అన్నాడట. సురేష్‌ బాబు కూడా చూశాడు. ఆయనకు కూడా అదే అనిపించింది. దీంతో సినిమానే ఆపేశారు. అలా సౌందర్య, వెంకీ కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయింది. 
 

45
Daggubati Venkatesh

ఇది `పవిత్ర బంధం` తర్వాత రావాల్సిన మూవీ. నిర్మాత, దర్శకుడి నిర్ణయంతో ఆగిపోయింది. అయినా ఆ తర్వాత `పెళ్లిచేసుకుందాం` సినిమా వచ్చింది. అయితే ఆగిపోయిన జయంతి సి పరాంజీ కొంత గ్యాప్‌ తీసుకుని `ప్రేమించుకుందాం రా` సినిమా చేశారు. అది సంచలన విజయం సాధించింది. `పెళ్లి చేసుకుందాం` సినిమా పెద్దగా ఆడలేదు. మొత్తంగా వెంకటేష్‌, సౌందర్య కాంబినేషన్‌లో ఓ సినిమా షూటింగ్‌ ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయింది. 

55

ఇదిలా ఉంటే ఈ ఇద్దరు ఎక్కువగా కలిసి సినిమాలు చేయడం వల్ల ఇద్దరి మధ్య లవ్‌ ఎఫైర్‌ ఉందనే రూమర్స్ వచ్చాయి. ఇద్దరు క్లోజ్‌గా మూవ్ కావడం కూడా దీనికి కారణం కావచ్చు. అంతేకాదు ఇద్దరు పెళ్లి వరకు వెళ్లారనే పుకార్లు వ్యాపించాయి. వెంకటేష్‌.. సౌందర్యతో పెళ్లికి రెడీ అయ్యాడని, తండ్రి రామానాయుడు కల్పించుకుని బెదిరించాడని, దీంతో సౌందర్య వెళ్లిపోయిందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

read more: వెంకటేష్‌ డాన్స్ పై రామానాయుడు కంప్లెయింట్‌.. `కలిసుందాం రా` సెట్‌లో జరిగిన ఘటనతో తండ్రి సంచలన నిర్ణయం

also read: తండ్రి బాటలో రవితేజ కూతురు మోక్షద, ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న స్టార్ కిడ్
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories