సంధ్య థియేటర్ తోక్కిసలాట ఘటనలో అనూహ్యంగా అరెస్ట్ అయ్యారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అరెస్ట్ తరువాత అనూహ్య పరిణామలు చోటు చేసుకున్నాయి. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతరువాత ఆకరికి అల్లు అర్జున్ కు ఊరట లభించింది.
అరెస్ట్, పీఎస్ కు తరలింపు, వైద్యపరీక్షలు, నాంపల్ల కోర్డు, 14 రోజుల రిమాండ్.. ఇక బన్నీ జైల్ కు వెళ్ళడం ఖాయం అనుకున్నారు అంతా. కాని ఇక్కడే రెండు ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూసిన ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
అల్లు అర్జున్ కేసులో ట్విస్ట్ మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. . పుష్ప 2 ప్రీమియర్స్ రోజు రాత్రి సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసు శుక్రవారం అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అరెస్ట్ చేసి.. చిక్కడపల్లి స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇక అక్కడ నుంచి నాంపల్లి కోర్ట్ కు వెళ్ళగా.. కోర్డ్ ఏకంగా 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఇది జరుగుతుండగానే ఓ వైపు హైకోర్ట్ లో బన్నీ వేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అల్లు అర్జున్ తరపున ప్రముఖ నిర్మాత కమ్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
క్వాష్ పిటీషన్ ని పరిగణలోకి తీసుకోవాలని వాదించారు. బెనిఫిట్ షో గురించి, అల్లు అర్జున్ వస్తున్నారన్న సంగతి ముందుగానే పోలీసులకు చెప్పమాన్నారు. థియేటర్ కూడా పోలీసులకు లేఖ రాసింది. అంతే కాదు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఉదాహరణగా చెప్పారు లాయర్.
ఇక అటు నుంచి వాదన కూడా బలంగా వినిపించారు. హీరో హీరోయిన్ రావద్దని పోలీసులు ముందుగానే చెప్పారని అన్నారు. బన్నీ రావడం వల్ల.. అనుమతి లేుకుండా ర్యాలీగా రావడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు ప్రభుత్వం తరుపు లాయర్. ఇక ఇరువైపుల ఉదాహరణలు చెప్పుకుంటూ వాదించారు లాయర్లు.
ఇక ఈలోపు మరో ట్విస్ట్ జరిగింది. సంధ్య థియేటర్ తొక్కసలాటలో మృతురాలు భర్త, అతనే ఈ కేసులు నమోదు చేసింది. అయితే ఆయన పోలీసులకు ట్విస్ట్ ఇచ్చాడు. బన్నీని అరెస్ట్ చేస్తారని నాకు తెలియదు. చెప్పాలేదు. నేను కేసును వాపస్ తీసుకుంటున్నాను అన్నారు.
అందులో ఆయన తప్పులేదు. సినిమా చూస్తాను అని నా భర్య పట్టుపడితే తీసుకెళ్ళాను అని అన్నారు. అల్లు అర్జున్ చేసిన తప్పులేదు. ఆయన్ను అరెస్ట్ చేస్తారని తెలిస్తే కేసు పెట్టకపోదును అన్నారు. తాను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని ట్విస్ట్ ఇచ్చాడు మృతురాలి భర్త.
ఇక అల్లు అర్జున్ సెలబ్రిటీ అని.. ఆయన ఎక్కడికి పారిపోరు, విచారణకు సహకరిస్తున్నారు, సహకరిస్తారంటూ బన్నీ తరపు లాయర్ వాధించారు. అటు నాంపల్లి కోర్డు 14 రోజులు రిమాండ్ ఇచ్చి.. హైకోర్డ్ తీర్పు కోసం ఎదురు చూసింది. ఇక చివరకు అల్లు అర్జున్ కు కొన్ని షరతులు విధించి బెయిల్ మంజూరు చేసింది హైకోర్డ్. దాంతో అల్లు కుటుంబ సభ్యుల తో పాటు ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు.
allu arjun arrest
ఇక ఈలోపు ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతూ.. ప్రతి పక్ష నాయకులు స్పందించడం మొదలు పెట్టారు. బీఆర్ ఎస్ లీడర్ కెటీఆర్, హరీష్ రావు తో పాటు.. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు.
బన్నీకి మద్దతుగా ఎక్స్ లో ట్వీట్ చేశారు. అటు బన్నీ అరెస్ట్ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్రదర్ నాగబాబు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఇటు కోర్డ్ దగ్గర అల్లు అర్జున్ కు తోడుగా అరవింద్, అల్లు శిరీష్ తో పాటు నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చివరి వరకు ఉన్నారు.