PRC Issue:ఉద్యోగుల నిరసనలతో దద్దరిల్లిన సచివాలయం

Jan 20, 2022, 3:33 PM IST

అమరావతి: పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. సచివాలయంలోని మూడవ బ్లాక్ వద్ద సమావేశంమై ఉద్యోగులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయి మొదటి బ్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు.