Jan 2, 2023, 4:26 PM IST
అమరావతి : టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రేపు(మంగళవారం) చింతమనేని పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జిల్లాలోని ఆయన సొంత నియోజకవర్గం దెందులూరులో టిడిపి శ్రేణులు రక్తదాన శిబిరం నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అయితే ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను పోలీసులు అడ్డుకోగా చింతమనేని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తిస్తూ కాళ్లుచేతులు పట్టి పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. ఈ సమయంలో జరిగిన పెనుగులాటలో చింతమనేని ప్రభాకర్ చొక్కా చిరిగిపోయింది.
పోలీసులు విడిచిపెట్టిన తర్వాత చిరిగిన చొక్కాతోనే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు చింతమనేని. పోలీసులు మాజీ ఎమ్మెల్యేగా కాదు కనీసం సాటి మనిషిగా కనీస గౌరవం ఇవ్వకుండా దారుణంగా ప్రవర్తించారని చింతమనేని వాపోయారు.