ఏపీ పంచాయితీ ఎన్నికలు2021: నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి

Feb 5, 2021, 10:39 AM IST

విజయవాడ: పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అక్రమాలను నిలువరించేందుకు అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.  ఇందులో భాగంగా కృష్ణా జిల్లా మండవల్లి మండలం ఉనికిలి గ్రామంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ నూకరాజు, ఎస్ఐ లక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది నాటుసారా స్థావరాలపై దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో లక్షా పద్నాలుగు వేల రూపాయలు విలువ గల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఎన్నికల వేళ నాటుసారా అక్రమ మద్యం పంపకాలు, నగదు పంపిణీ పూర్తి స్థాయిలో అడ్డుకోవడానికి నిఘాని పెంచినట్లు తెలిపారు. ఇందుకోసం 24 గంటల హెల్ప్ లైన్ కూడా ప్రారంభించినట్లు వివరించారు. ఎక్కడైనా నగదు పంపిణీ ఉన్నా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.