విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై ఉక్కుపాదం... రాత్రికి రాత్రే పల్లా దీక్ష భగ్నం

Feb 16, 2021, 9:58 AM IST


విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షా శిబిరానికి రాత్రి 3:00 గంటలకు చేరుకున్న పోలీసులు పల్లాను అరెస్టు చేసి కిమ్స్ హాస్పిటలకు తరలించారు.  ఈ నెల 10వ తేదీ నుండి మాజీ ఎమ్మెల్యే పల్లా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.