
పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువయ్యేలా పని చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరులో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించి.. అక్కడి నుంచి రాష్ట్రంలోని 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ, అభివృద్ధి సమన్వయం జరుగుతుందన్నారు. సులభంగా, సత్వరంగా ప్రజలకు సేవలందించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.