
ఉప్పాడ మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేసి.. మత్స్యకారులకు అదనపు ఆదాయం తెచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. మత్స్యకారుల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. తమిళనాడు, కేరళకు అధ్యయనం కోసం ఉప్పాడ మత్స్యకారులతో ప్రత్యేక బృందాలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాడ మత్స్యకారులతో మంగళగిరిలో సమావేశమై మాట్లాడారు.