Galam Venkata Rao | Published: Feb 18, 2025, 10:00 PM IST
యూపీలోని ప్రయాగరాజ్ లో అత్యంత వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. భార్య అన్నా లెజినోవాతో కలిసి కుంభమేళాలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ త్రివేణి సంగమంలో పుణ్య చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్... మహా కుంభ మేళా నిర్వహిస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భాషలు, సంస్కృతులు వేరైనా మనందరం కలిసేందుకు ఇదో గొప్ప అవకాశం అని చెప్పారు.