తెలుగు రాష్ట్రాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి నిర్వహించారు. నందమూరి, నారా వారి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు నివాళి అర్పించారు. ఏపీ మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని NTR ఘాట్ ని సందర్శించి.. పుష్పాంజలి ఘటించారు.