Jun 24, 2020, 6:14 PM IST
రాష్ట్రంలోజగన్ ప్రభుత్వం ఏడాది పాలనలో విఫలమయిందని మాజీ డిప్యూటీ సీఎం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. ప్రభుత్వం మీద మాట్లాడితే కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు జగన్. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే నలంద కిశోర్ ను అరెస్ట్ చేశారు. మరి విజయ్ సాయి రెడ్డి రోజుకో ట్వీట్ పెడుతున్నాడు అతన్ని ఎందుకు చర్య తీసుకోవడంలేదు అంటూ ప్రశ్నించారు.