Dec 17, 2020, 12:04 PM IST
చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలంలో దారుణం చోటుచేసుకుంది. మరో ఏడురోజుల్లో పెళ్లనగా ఓ యువతిపై హత్యాయత్నం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న యువతిని చంపడానికి ప్రయత్నించారు దుండగులు.
ఈ ఘటన సొంపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుమతి(24) యువతి పెళ్లి మరో ఏడురోజుల్లో జరగాల్సి వుంది. అయితే ఇంట్లో నిద్రిస్తున్న యువతిపై గురువారం తెల్లవారుజామున హత్యాయత్నం జరిగింది. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు మంచంపై నిద్రిస్తున్న సుమతిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. మంటల్లో కాలుతూ ఆమె కేకలు వేయడంతో నిద్రిస్తున్న తల్లిదండ్రులు లేచి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే యువతి శరీరం అప్పటికే చాలా కాలిపోయింది.
యువతిని చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 7 రోజుల్లో వివాహము ఉండగా ఈ సంఘటన చోటుచేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.