Feb 26, 2021, 11:54 AM IST
అమరావతి: ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై సంబంధిత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐ.టీ శాఖ ఆధ్వర్యంలోని పలు కీలక ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ స్వయం ప్రతిపత్తి వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అధికారులకు మంత్రి మేకపాటి ఆదేశించారు. మిలీనియం టవర్లు, సిగ్నేచర్ టవర్లు, ఐ.టీ కాన్సెప్ట్ సిటీ అంశాలపై మంత్రికి ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ క్రమంలోనే ఏపీటీఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న మౌలికాభివృద్ధి పనులపైనా చర్చ కొనసాగింది.
ఈ సమీక్షా సమావేశానికి ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి జీ.జయలక్ష్మి, ప్రత్యేక కార్యదర్శి బి. సుందర్, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి హరిప్రసాద్ రెడ్డి లింగాల, జాయింట్ సెక్రటరీ నాగరాజు, ఇతర అధికారులు హాజరయ్యారు.