భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణయించిన గడువుకంటే ముందే పూర్తి చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు వేగంగా పెరగనున్నాయని ఆయన పేర్కొన్నారు.