రైతులు.. పొగాకు సాగును విడిచిపెట్టాలి.. కన్నబాబు

May 27, 2020, 10:40 AM IST

గుంటూరు పొగాకు బోర్డ్ కార్యాలయంలో పొగాకు రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న  సమస్యలు, ఇబ్బందులపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. పొగాకు రైతులు, ట్రేడర్ల నుంచి వారి అభిప్రాయాలను సేకరించిన కన్నబాబు ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షాన ఉండి వారి ఉత్పత్తులకు తగిన ధరను ఇప్పించేందుకు కృషి చేస్తుందన్నారు. పొగాకు సాగు వచ్చే ఏడాది నుంచి తగ్గించేలా అందరూ సహకరించాలన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు రావాలంటే ట్రేడర్లు , వ్యాపారులు పోటీతత్వంతో మార్కెట్ లో  పాల్గొనాలని మంత్రి కన్నబాబు కోరారు. వచ్చే ఏడాది నుంచి పొగాకు సాగుకు బదులుగా ప్రత్యన్మాయ పంటల సాగు చేసేందుకు  ప్రయత్నం చేయాలని రైతులకు సూచించారు.