Mar 23, 2022, 4:51 PM IST
నెల్లూరు: నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు నెల్లూరులో వైభవంగా జరిగాయి. ఆయన అభిమానులు, వైసిపి నాయకులు ఆయన తమ అభిమాన నాయకుడి పుట్టినరోజును అంగరంగవైభవంగా జరిపారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో మంత్రి అనిల్ భారీ ప్లెక్సీని ఏర్పాటుచేసిన అభిమానులు పాలాభిషేకం చేసారు. అనంతరం చేతిలోనే కర్పూరం వెలిగించుకుని హారతిచ్చి ఓ యువకుడు అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా అనిల్ యాదవ్ పుట్టినరోజున ఆయన అభిమానులు సందడి చేసారు.