Aug 1, 2020, 4:19 PM IST
మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందకుండా చంద్రబాబు ఎన్ని నాటకాలాడారో రాష్ట్రం అంతా చూశారని, ఆయనకు ఆయన తొత్తులకు ఇది నిజంగానే బ్లాక్ డే అంటూ మంత్రి అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో సొంతింట్లో ఉంటూ అమరావతి మీద మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే చంద్రబాబు ఇంత తాపత్రపడుతున్నాడు... ఇప్పుడు ఎన్ని పల్టీలు కొట్టినా నడవదని అన్నారు.