వేదగిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆలయ మౌలిక వసతులు, భక్తుల సౌకర్యాలు, రహదారులు, పార్కింగ్ వంటి అంశాలపై సమీక్ష చేసి, పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.