Apr 28, 2020, 12:51 PM IST
లాక్ డౌన్ ఉల్లంఘనలు చేయద్దని ఎంత చెప్పినా వినని వారికి విజయవాడ పోలీసులు కొత్త రకం శిక్షలు కనిపెట్టారు. వారిని పట్టుకొచ్చి అంబులెన్స్ లో తరలిస్తున్నారు. అంబులెన్స్ లో వస్తే ఇంకేముంది కరోనా పేషంట్ అనుకుని ఆ చుట్టు పక్కల వాళ్లు చేసే హడావుడికి దెబ్బకు మరోసారి ఉల్లంఘించడు. ఇలాంటి వాళ్లను వీలైతే క్వారంటైన్ కు కూడా తరలించినా తప్పులేదు. ఇలాంటి శిక్షల వల్లైనా లాక్ డౌన్ ఉల్లంఘనలు తగ్గుతాయేమో చూడాలి.