AP Rains 2024: ప్రకాశం బ్యారేజీకి రికార్డ్ వరద ప్రవాహం

AP Rains 2024: ప్రకాశం బ్యారేజీకి రికార్డ్ వరద ప్రవాహం

Published : Sep 05, 2024, 10:08 PM IST

భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి...

భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి... చెరువులు, జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. వరద నీటితో కృష్ణా నది చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకీ 12లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ఇప్పటివరకు ఈ బ్యారేజీకి వచ్చిన అత్యధిక వరద ఇదే ... ఇంకొంచే వరద ప్రవాహం పెరిగితే బ్యారేజీ పైనుండి నీరు వెళుతుంది.