Jul 28, 2021, 2:00 PM IST
విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును అరెస్ట్ చేశామని... ప్రస్తతం ఆయన తమ కస్టడీ లోనే ఉన్నారని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు కాబట్టే మాజీ మంత్రిని అరెస్ట్ చేశామన్నారు. జి. కొండూరు వద్ద జరిగిన ఘటనపై 100శాతం ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. దేవినేని ఉమపై అందిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామన్నారు. దేవినేని ఉమ ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతో జి.కొండూరులో అలజడి సృష్టించారని డీఐజీ మోహనరావు తెలిపారు. ఉదేశపూర్వకంగానే దేవినేని ఉమ వివాదం సృష్టించారన్నారు. ముందస్తు పథకంలో భాగంగానే ఉమ కొండపల్లి నుంచి తన అనుచరులతో వెళ్లారన్నారు. వైసిపి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉమ వ్యహరించారు... పూర్తి ఆలజడికి ఆయనే కారణమని డిఐజి పేర్కొన్నారు.