Andhra pradesh news : గుడివాడలో మట్టిమాఫియా అరాచకం... ఆర్ఐ పై జేసిబితో దాడి

Apr 22, 2022, 11:14 AM IST

గుడివాడ: అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకోడానికి ప్రయత్నించిన ఆర్ఐ పై కొందరు దాడికి పాల్పడిన ఘటన  కృష్ణా జిల్లా గుడివాడ మండల పరిధిలో చోటుచేసుకుంది. మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐపై దుండగులు జేసీబీతో దాడి చేసారు. అయితే ఈ దాడికి పాల్పడింది అధికార వైసిపి పార్టీ వర్గీయులేనని తెలుస్తోంది.   మోటూరు గ్రామ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు... దీన్ని అడ్డుకోవాలని తహసీల్దార్ నుండి ఫోన్ రావడంతో వీఆర్ఏ, వీఆర్వోలను వెంటపెట్టుకుని వెళ్ళినట్లు ఆర్ఐ ఆనంద్ తెలిపారు. తాను వెళ్లేసరికి జేసీబీ, మూడు ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలు చేస్తున్నారని... వెంటనే ఈ పనులు ఆపాలని కోరినట్లు తెలిపారు. కానీ పనులు ఆపకుండా నాతో వాగ్వాదానికి దిగి జేసిబితో దాడి చేసారని...ఎలాగోలా అక్కడినుండి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్ఐ తెలిపారు.  పోలీసులు వచ్చి 3 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ చేసినట్లు ఆర్ఐ వెళ్లడించారు.