కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో ఉద్రిక్తత... పోలీసులు-బిజెపి శ్రేణులు వాగ్వాదం

Aug 19, 2021, 3:46 PM IST

విజయవాడ: కేంద్ర పర్యటన శాఖ మంత్రి కిషన్ రెడ్డి విజయవాడలో చేపట్టిన ప్రజాఆశీర్వాద యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. కిషన్ రెడ్డి వాహనం వెనకాలే ర్యాలీగా ఫాలో అవుతున్న తమను పోలీసులు అడ్డుకున్నారని బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులతో బిజెపి నాయకులు వాగ్వాదానికి దిగారు. తమను అడ్డుకున్న విషయాన్ని బిజెపి కార్యకర్తలు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.