జనసేన ఆవిర్భావ సభ... విజయవాడలో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం

Mar 14, 2022, 10:47 AM IST

మంగళగిరి: జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఇవాళ(సోమవారం) మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 2024 ఎన్నికలే టార్గెట్‌గా ఈ సభను భారీగా నిర్వహిస్తోంది జనసేన. ఈ సభ కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ బయట పవన్ కల్యాణ్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆయన మంగళగిరి బయలుదేరారు.