చొక్కా వేసుకొని వెళ్లని యజ్ఞశాలవద్ద చెప్పులు వేసుకొని వెళ్లిన ఘనుడు జగన్ అని బ్రాహ్మణ సాధికారసమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఒకసారి ఇందిరాగాంధి స్టేడియంలో రాష్ట్ర అభివృద్ది కోసం యజ్ఞం చేస్తానని జగన్ చెప్పి చెప్పులేసుకొని యజ్ఞశాలకు వెళ్లిన వ్యక్తి. వైసీపీ నేతల పాపాలు... పుట్టలోని పాముల్లా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గుడ్లగూబ ఏ విధంగా వెలుగును చూడలేదో అదేవిధంగా వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర అభివృద్దిని చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. సుప్రీం కోర్టు సీబీఐ (సిట్) ఎంక్వైరీ వేసింది. తిరుమల లడ్డూలో కల్తీ నూనె వాడిన విధానాన్ని బయట పెట్టాలని కృషి చేస్తోంది. ఈ విషయంపై గతంలో చంద్రబాబు తన బాధను వ్యక్తం చేశారు. ఎంక్వైరీలో వైష్ణవి, ఏఆర్, భోలే బాబ లను ఎంక్వైరీ చేశారు." "నెయ్యిలో కల్తీ జరిగిందని నిర్ధారించారు. నలుగురిని అరెస్టు చేశారు. 2023, ఏప్రీల్ 20వ తేదిన ఇదే వేదికపై నుంచి ప్రసాదంలో నూనెలో కల్తీ జరుగుతోందని తెలిపాము. గత ప్రభుత్వ తిరుపతి లడ్డూ, మా ప్రభుత్వంలో లడ్డూని తేడా చూపాము. తన రాజకీయ అవసరాలకు దేవుడిని వాడుకుంటున్నారని మా మీద కుక్కల్లా మీద పడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో జరుగుతున్న సిట్, సీబీఐ ఎంక్వైరీలో భాగంగా నలుగురిని అరెస్టు చేశారు." "40 ఏళ్ల నుండి కర్ణాటక ప్రభుత్వం టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. వాళ్ల ఆధ్వర్యంలో సరఫరా అయ్యే నందిని నెయ్యి కంపెనీని ఎందుకు పక్కన పెట్టారో తెలపాలి. నందిని అంటే దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో నడుపుతున్న సంస్థ. అనేక ప్రభుత్వాలు మారినా వారికే టెండర్ ఇచ్చేవారు. అన్ని ప్రభుత్వాలు బాధ్యతతో ప్రవర్తించాయి. జగన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించి వేరేవారికి టెండర్ ఇచ్చారు. ఇంట్లోనే దేవుడి సెట్టింగ్ వేసిన మహానుభావుడుజగన్. తన ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో వెంకటాయపాలెంలో దేవుడి గుడి ఉంది. అక్కడికి వెళ్లి దండం పెట్టుకొని రావచ్చు, ఉగాది సంబరాలు చేసుకోవచ్చు. కానీ దేవుడి గుడినే తన ఇంటిలో పెట్టుకున్న ఘనత జగన్ కే దక్కుతుంది." "దేవుడిని ప్రతిష్టించాలంటే ఒక పెద్ద తతంగం, తంతు ఉంటుంది. ఘనంగా పూజా కార్యక్రమాలు చేయాలి. అదేమీ చేయకుండా తన ఇంటిలో దేవాలయ సెట్టింగ్ వేశాడు. జగనే ఒక దేవుడనుకుంటాడు. రూ. 6 కోట్లు పెట్టి తన ఇంటిలోనే దేవాలయ సిట్టింగ్ వేశాడు. జగన్ కు హిందువులపై, హిందువుల దేవుళ్లపై గౌరవం లేదు. చొక్కలు కూడా వేసుకోని యజ్ఞశాల వద్ద చెప్పులు వేసుకుని వెళ్లాడు. జగన్ ఐదేళ్ల పాలనలో జరగని అక్రమాలు లేవు. సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా ఉండి ఆలయానికే మచ్చ తెచ్చారు. వారు చేసిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటే వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. టీటీడీలోనే కాకుండా బయట కూడా వారు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండడంతో వైసీపీ నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తప్పు చేసిందే కాక ఎదురుదాడి చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. వ్యక్తిగత ఆరోపణలకు దూరంగా ఉంటానని చంద్రబాబు ఎప్పుడో చెప్పారు. వైసీపీ నాయకులు చేసిన తప్పులన్నీ బయటికి వస్తాయి. వైసీపీ నాయకులందరూ జైళ్లపాలు కాక తప్పదు. వైసీపీ హయాంలో రాములవారికి అపచారం చేశారు. ఇప్పుడు కర్మ అనుభవిస్తారు." "కాకినాడ, రాజమండ్రి, అంతర్వేది, దుర్గ అమ్మవారు ఇలా పలు ఆలయాలలో దాడులు చేయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఎక్కడైనా ఒక్క దాడి జరిగిందేమో చెప్పాలి. నెల్లూరులోని ఒక గుడి మన కడపలో గుళ్ళు ఇవన్నిటి మీద దాడులే. పూజారుల మీద దాడులు జరిగాయి. వైసీపీ నాయకులు కొవ్వెక్కి ప్రవర్తిస్తున్నారు నక్క జిత్తులు ప్రదర్శిస్తున్నారు. ఫెయిర్ గా మాట్లాడండి. మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి. అప్పుడైనా మీకు శిక్ష తగ్గుతుంది. ఈ వైసీపి నక్కలకు పొగరు అణచే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. మీ అందరిని కూడా సరైన పద్ధతిలో మీరు చేసిన తప్పులను బయటికి తెచ్చి మిమ్మల్ని శిక్షిస్తుంది. దానికి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కంకణం కట్టుకుంది. టిటిడి లోని పవిత్రతను కాపాడటంలో మేము ముందుంటాం. ఎక్కడైనా టిటిడి లో అపవిత్రం జరిగితే చూస్తూ ఊరుకోం" అని బ్రాహ్మణ సాధికారసమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ హెచ్చరించారు.

06:13ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం: Ernakulam Express Train Fire | Asianet News Telugu
32:33CM Chandrababu Speech: చంద్రబాబు పంచ్ లకి పడి పడి నవ్విన నారా భువనేశ్వరి| Asianet News Telugu
25:38Vangalapudi Anitha Strong Warning to Jagan: గుర్తుపెట్టుకో జగన్ ఎవ్వరినీ వదిలిపెట్టం |Asianet Telugu
14:12Nagababu Comments: వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు శివాజీకి నాగబాబు వార్నింగ్| Asianet Telugu
05:52CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
10:02Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu
24:07CM Chandrababu Powerful Speech at Bharatiya Vigyan Sammelan in Tirupati | Asianet News Telugu
21:39వాజపేయి అధికారం కోల్పోవడానికి కారణం చంద్రబాబే: Kakani Govardhan Reddy Comments | Asianet News Telugu
18:59CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu
06:57Pemmasani Chandrasekhar Powerful Speech: Atal Bihari Vajpayee 101st Jayanthi | Asianet News Telugu