video news :భారతదేశ నౌకాదళ దినోత్సవ స్పెషల్

Dec 4, 2019, 9:50 PM IST

భారత దేశములో నౌకాదళ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 వ తేదీన జరుపుతారు . 1971 ఇండో-పాక్ యుద్ధము సమయంలో నౌకా దళాలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. దేశానికి నౌకా దళాల విజయాలు మరియు దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి ఈ నేవీ ధినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం మరియు భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు.

17 వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి , ఛత్రపతి శివాజీ భోంస్లే "భారత నావికా పితామహుడి" గా భావిస్తారు.భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్రపరచుటలో మరియు ఓడరేవు సందర్శనల ద్వారా భారతదేశం యొక్క అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగుపరిచేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది.ఈ నివేదిక ప్రకారం 58,000 మంది సిబ్బంది, విమాన వాహక నౌక, పెద్ద రవాణా ఓడ, 15 యుద్ధనౌకలు, 8 గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, 24 కొర్వెట్టెలు, 13 సంప్రదాయ జలాంతర్గాములు, 1 అణు దాడి జలాంతర్గామి, 30 పెట్రోల్ ఓడలు, వివిధ సహాయక నౌకలు మొదలైనవి భారత నావికాదళంలొ భాగంగా వున్నాయి.