May 3, 2022, 4:15 PM IST
విశాఖపట్నం: విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అరకుకు చెందిన భార్యాభర్తలు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయి మృతిచెందారు. మొదట భర్త కరెంట్ షాక్ కు గురవగా అతడిని కాపాడేందుకు ప్రయత్నించి భార్య కూడా షాక్ కు గురయ్యింది. ఇద్దరినీ హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కరెంట్ షాక్ కు గురయిన భార్యాభర్తలను వెంటనే హాస్పిటల్ కు తరలించేందుకు 108కు ఫోన్ చేసి సమాచారమివ్వగా అంబులెన్స్ సమయానికి రాలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. దీంతో అప్పటికే పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయిందని... చికిత్స అందిస్తుండగానే దంపతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం