విజయవాడలో పెను ప్రమాదం... హోర్డింగ్ కుప్పకూలి రోడ్డుపై తెగిపడ్డ హైటెన్షన్ విద్యుత్ వైర్లు

Aug 8, 2022, 4:40 PM IST

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాలు ప్రమాదాలు సృష్టిస్తున్నాయి. ఇలా తాజాగా కురుస్తున్న వర్షాలతో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో  ప్రమాదం జరిగింది. బందరు రోడ్డులో ఓ ప్రైవేట్ సంస్థ అడ్వర్టైజింగ్ హోర్డింగ్ ఈదురుగాలులకు కుప్పకూలి హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ ధర్మవరం ఘటనలో మాదిరిగా విద్యుత్ సరఫరా జరిగివుంటే చాలా ప్రమాదం జరిగివుండేది. రోడ్డుపై విద్యుత్ తీగలు తెగిపడటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న విద్యుత్ సిబ్బంది తీగలను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నారు.