Jun 30, 2020, 1:09 PM IST
కర్నూలు జిల్లా ఆదోనిలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. అర్థరాత్రి 12 గంటల నుండి తెల్లవారు జామున 5 గంటల వరకు యెడతెరుపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అదొని పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ చెరువు కుంటలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత పదేళ్లుగా ఇలాంటి వర్షం కురవలేదని స్థానికులు అంటున్నారు.