Jul 8, 2020, 5:31 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన మల్లికార్జునరావు వినూత్న రీతిలో కరోనా వ్యాధిపై ప్రచారం చేస్తున్నాడు. తన టూవీలర్ కు వైరస్ నమూనాలతో ముందు, వెనుక భాగలలో కరోనా ఆకృతితో ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. దీనికి మైకు బిగించి తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు. లాక్ డౌన్ రెండో రోజు నుంచే ఈ ప్రచారాన్ని మొదలుపెట్టానని చెబుతున్నాడు. ఒక చిన్న బాటిల్లో ఉప్పు నీటిలో కలుపుకొని ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలని చెబుతున్నాడు. అలాగే మగవాళ్లలో మూతి, ముక్కు మీసం గడ్డానికి వైరస్ అంటిపెట్టుకొని ఉంటుందని, ఎక్కువ శాతం స్త్రీలు సిల్క్ చీరలు వాడడం ద్వారా ఎక్కువ శాతం కరోనా వైరస్ అంటిపెట్టుకొని ఉంటుందని సిల్క్ చీరల బదులు కాటన్ చీరలు ధరించాలని చెబుతున్నాడు.