Goverment Employees Strike in AP:ధర్నాలతో దద్దరిల్లిన కృష్ణా జిల్లా

Dec 16, 2021, 3:19 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లాలో ఒకేరోజు అటు ఉపాధ్యాయులు, ఇటు బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పిఆర్సి ప్రకటనతో  సిపిఎస్ రద్దు, డిఎ బకాయిలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంపు డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఇదిలావుంటే ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు తిరువూరు పట్టణంలో ధర్నా నిర్వహించారు.