vuukle one pixel image

కరోనా మీద కాకుండా రాజధాని భూములమీద శ్రద్ధ.. జగన్ మీద చినరాజప్ప ఫైర్...

Apr 3, 2020, 3:33 PM IST

ప్రపంచాన్నే భయాందోళనలు కలిగిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ను ఏపీలో కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ డిప్యూటీ సిఎం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు.  ఏపీలో కరోనా కట్టడిపై  ప్రతిపక్షనేత చంద్రబాబు బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు  అప్రమత్తం చేస్తున్నారు కానీ బాధ్యతగా ఉండాల్సిన ఏపీ సీఎం జగన్ పారసిటమల్ వేసుకుంటే చాలంటూ ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. ఏపీలో కరోనా పాజిటీవ్ కేసులు ఇప్పుడు  165 కి చేరడం ఆందోళన కలిగించే విషయం అన్నారు.