Nov 28, 2019, 5:25 PM IST
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు రాజధాని అమరాతిలో పర్యటించారు. ఉదయం 9గంటలకు చంద్రబాబు తన నివాసం నుంచి టీడీపీ నేతలతో కలిసి అమరావతి సందర్శనకు బయలుదేరారు. ముందుగా ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు పరిశీలించారు.