Jan 15, 2022, 4:52 PM IST
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం లక్ష్మీ దేవి పేట. అంబేద్కర్ కాలనీలో .... గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదం సంభవించింది. అది గమనించిన స్థానికులు వెంటనే కిటికీలను పగలగొట్టి మంటలను ఆర్పి వేశారు. తుది లో తప్పిన పెను ప్రమాదం. లక్ష్మీ దేవి పేట లో కాండ్రేగుల ఈశ్వరరావు కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉన్న సమయంలో గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు రావడం జరిగింది. అది గమనించిన స్థానికులు కిటికీ అద్దాలను పగులగొట్టి మంటలను ఆర్పి వేశారు.. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినా ఎవరికీ ఎటువంటి ప్రాణ హాని జరగలేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.