విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం..

Nov 17, 2020, 10:14 AM IST


విజయవాడలోని వన్ టౌన్ విద్యాధరపురం RTC వర్క్ షాప్ రోడ్ లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల్లో చిక్కుకున్న లారీ పూర్తిగా దగ్ధం అయ్యింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలేంటి ఇంకా తెలియలేదు.