Galam Venkata Rao | Published: Feb 28, 2025, 7:00 PM IST
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు అందజేశారు. మార్చి 5వ తేదీన విజయవాడ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో అత్యాచారానికి గురైన బాధితుల పేర్లు బయటపెట్టారని గోరంట్ల మాధవ్‌పై అప్పటి మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు... తాజాగా నోటీసులు ఇచ్చారు.