వీధి రౌడిల్లా విద్యుత్ సిబ్బంది... గుంటూరు అన్నదాతల ఆవేదన చూడండి...

Jan 24, 2022, 1:13 PM IST

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం జయంతిరామాపురం గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్ కలెక్టర్లు, లైన్ మెన్ వీధి రౌడీల్లా వ్యవహరించడంతో భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు తెలిపారు. పోలీస్ కేసులు, పెనాల్టీలు అంటూ తమనుండి వేలకు వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్ బిల్లు పెండింగ్ అంటూ గ్రామంలోని ప్రతి ఇంటి చుట్టు తిరుగుతూ బిల్లు కట్టండి లేదంటే కరెంట్ కట్ చేసి మీపై పోలీస్ కేసు నమోదు చేసి మోకాళ్ళ మీద కూర్చోపెడతామని బెదిరింపులకు గురి చేస్తున్నారని జయంతి రామాపురం ప్రజలు ఆందోళన వ్యక్తం చేసారు.