వాళ్ళ మర్యాదను తట్టుకోలేకపోతున్నా... అందుకే టిడిపి రాజీనామా: దివ్యవాణి ప్రకటన

Jun 2, 2022, 11:33 AM IST

అమరావతి: సినీ నటి, టిడిపి అధికార ప్రతిపిధి దివ్యవాణి తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. పార్టి అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత కూడా రాజీనామాపై దివ్యవాణి వెనక్కితగ్గలేదు. టిడిపి రాజీనామాకే తాను కట్టుబడి వున్నట్లు ప్రకటిస్తూ ఓ వీడియోను దివ్యవాణి విడుదల చేసారు.  టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును కలవడానికి పార్టీ ఆఫీసుకు వెళ్లిన సమయంలో జరిగిన పరిణామాలను దివ్యవాణి వివరించారు. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు చంద్రబాబును కలవడానికి పార్టీ  వెళితే రాత్రి ఏడు ఏడున్నర గంటలకు ఆఫీస్ నుండి వెళ్లిపోయే సమయంలో కలిసారని అన్నారు. ఆయనను కలిసి రాజీనామా ఎందుకు చేయాల్సి వస్తుందో వివరించే సరికి ఎనిమిది ఎనిమిదిన్నర అయ్యిందన్నారు. ఇలా వాళ్ల మర్యాదను తట్టుకోలేకపోయానని... అందుకే రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. మీడియా సమావేశం నిర్వహించి రాజీనామాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆమె తెలిపారు.