హిందీలో బిగ్ బాస్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అర్షద్ వార్సి ఫస్ట్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించారు. అనంతరం శిల్పా శెట్టి, సంజయ్ దత్, అమితాబ్ వంటి స్టార్స్ హోస్టింగ్ చేశారు. సల్మాన్ ఖాన్ అత్యంత విజయవంతమైన బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నారు. ఆయన సీజన్ 4 నుండి ఇప్పటి వరకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
బిగ్ బాస్ హిందీ 17 సీజన్స్ పూర్తి చేసుకుంది. 18వ సీజన్ అక్టోబర్ 6 నుండి ప్రసారం కానుంది. ఈ మేరకు ప్రోమో సైతం విడుదల చేశారు. ఆడియన్స్ ఆతృతగా లేటెస్ట్ సీజన్ కొరకు వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ క్రేజీ సెలబ్రిటీ షోలో పాల్గొనున్నారట.